Breaking News
Home / SPORTS / పొట్టి ఫార్మాట్ తో మొదలెట్టి పెద్ద ఫార్మాట్ తో ముగించిన ఇంగ్లాండ్ !

పొట్టి ఫార్మాట్ తో మొదలెట్టి పెద్ద ఫార్మాట్ తో ముగించిన ఇంగ్లాండ్ !

క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ ఆట మొదలెట్టినప్పటినుండి మొన్నటి వరకు ప్రపంచకప్ రుచి చూడలేకపోయింది. ఎన్నిసార్లు ఫైనల్ కి వచ్చినా ఫలితం మాత్రం వారికి అనుకూలంగా వచ్చేది కాదు. అలాంటిది ఇంగ్లాండ్ జట్టుకు ఈ దశాబ్దకాలంలో బాగా కలిసోచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే 2010లో కాలింగ్ వుడ్ కెప్టెన్సీలో టీ20 టైటిల్ గెలుచుకున్న ఇంగ్లాండ్ అప్పటినుండి ఎదురులేని జట్టుగా నిలుస్తుంది. అంతేకాకుండా ఎప్పటినుండో ఎదురుచూస్తున్న  ప్రపంచకప్ మొత్తానికి ఈ ఏడాదిలో ఇంగ్లాండ్ వశం అయ్యింది. దాంతో ఈ దశాబ్దకాలంలో అంటే 2010లో టీ20 టైటిల్ తో మొదలుపెట్టి ఇప్పుడు 2019 లో ప్రపంచకప్ తో ముగించింది.