ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఎఫెక్ట్ తో స్కూల్స్ బంద్ పడుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. దేశ రాజధాని మహానగరమైన ఢిల్లీ లోని నోయిడాలో కరోనా వైరస్ కారణంగా ఒక ప్రయివేట్ స్కూలుకు మూడ్రోజులు సెలవు ఇస్తున్నట్లు ఆ స్కూలు యజమాన్యం ప్రకటించింది.
కరోనా సోకిన రోగికి చెందిన ఇద్దరు పిల్లలు ఈ స్కూలులోనే చదువుతున్నారు. అయితే నిన్న వాళ్లిద్దరూ స్కూలుకు రాలేదు. తమ తండ్రికి కరోనా సోకడంతో స్కూలుకు రాలేదు అని వారు వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం అందించారు.
ఇది కాస్త వైరల్ అయి పలువురు తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూలుకు పంపలేదు. దీంతో స్కూలు యజమాన్యం మూడ్రోజులు సెలవు ప్రకటించింది.