Home / TELANGANA / కరోనా భారిన పడకుండా ఉండాలంటే మనకున్న ఏకైక ఆయుధం సామాజిక దూరం..కేసీఆర్ !

కరోనా భారిన పడకుండా ఉండాలంటే మనకున్న ఏకైక ఆయుధం సామాజిక దూరం..కేసీఆర్ !

కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారుల, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 59కి చేరిందని తెలిపారు. ఇవాళ ఒక్క రోజే 10 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సీఎం వెల్లడించారు. మరో 20 వేల మంది హోం క్వారంటైన్‌ కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతుల్లో అధికారులు, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సీఎం చెప్పారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నవారికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరిస్తున్నందున వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సీఎం తెలిపారు. లాక్‌డౌన్‌ ప్రకటించకపోతే ఈ కేసుల సంఖ్య ఇంకా పెరిగి ఉండేదన్నారు. లాక్‌డౌన్‌, కర్ఫ్యూ కనుక అమలు చేసి ఉండకపోతే భయంకరంగా ఉండేది. మన అందరి బతుకులు కూడా ప్రమాదంలో ఉండేవి. ఈ వ్యాధికి ప్రపంచంలో మందు లేదు. యావత్‌ ప్రపంచం ఈ సమస్యను ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఉన్న మందు ఏందంటే.. దీని వ్యాప్తిని నిరోధించడమే పెద్ద మందు అని సీఎం పేర్కొన్నారు.
న్యూయార్క్‌లో 11 వేల వెంటిలేటర్లు ఉన్నాయి. న్యూయార్క్‌ సిటీలో మాత్రం 3 వేల వెంటిలేటర్లు ఉన్నాయి. న్యూయార్క్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. వారికిప్పుడు 30 వేల వెంటిలేటర్లు అవసరమని సీఎం చెప్పారు. అమెరికా కూడా ఆగమాగం అవుతుంది. కరోనా నియంత్రణకు మనకున్న ఏకైక ఆయుధం సామాజిక దూరమే అని సీఎం స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి. పరిశుభ్రత ముఖ్యం. అమెరికా, చైనా, స్పెయిన్‌, ఇటలీ స్థాయిలో వస్తే మన వద్ద 20 కోట్ల మంది జబ్బు బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్రజలకు మరోసారి రెండు చేతులు జోడించి చెప్పతున్నాను. మన స్వీయ నియంత్రణ మనకు శ్రీరామరక్ష. జాగ్రత్తలు పాటించడమే ఈ వ్యాధి నిరోధానికి  మూలం. మనం కఠిన చర్యలు తీసుకోకపోతే విస్ఫోటనంలా ఉండేది. ఇవాళ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాను. ఎలాంటి సహకారమైన అందిస్తామని మోదీ చెప్పారు అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat