ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప‌్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయి..ఆయా నియోజకవర్గాల్లో సీఎం రిలీఫ్ ఫండ్‌కు అప్లై చేసుకున్న వారికి స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఆర్థిక సాయానికి సంబంధించి చెక్‌లు ప్రభుత్వం అందజేస్తుంది.
ఈ నేపద్యంలోఈ రోజు వరంగల్ పశ్చిమ శాసనసభ సభ్యులు దాస్యం వినయ భాస్కర్ నివాసం లో సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు అయిన విద్య & వైద్యం అందరికీ అందాలి అని తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది అని. అందులో భాగంగాన్నే ఈ రోజు అర్హులైన పేదవాడికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయంగా ఈ చెక్స్ ని పంపిణీ చేస్తున్నాము అని , 9 లక్షల రూపాయల చెక్స్ ని అర్హులైన 11 మందికి అంది స్తున్నాము అని , ఇలాంటి అవకాశాన్ని అర్హులైన ప్రతి పేదవాడు ఉపయోగించుకోవాలి అని అన్నారు, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందటానికి ఈ పధకం ఉపయోగపడుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యడవరెడ్డి , TRS కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.