న్యూజీలాండ్‌తో టీ20 సిరీస్‌కు, శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు టీమిండియాను ప్రకటించారు సెలెక్టర్లు.టీ20 సిరీస్‌కు కొత్త కుర్రాళ్లకు ఛాన్స్ ఇచ్చారు. శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అలాగే కే.ఎల్.రాహుల్, మనీష్ పాండేను జట్టులోకి తీసుకున్నారు. నవంబర్ 1న ఢిల్లీలో జరిగే తొలి టీ20కి మాత్రమే ఆశీష్ నెహ్రాను ఎంపిక చేశారు. టెస్ట్ సిరీస్‌ల కోసం స్పెషలిస్ట్‌లను ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకున్న మురళీ విజయ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. కే.ఎల్ రాహుల్ తన ప్లేస్‌ను నిలబెట్టుకున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ రవీంద్ర జడేజా.. రవిచంద్రన్ అశ్విన్‌లతోపాటు ఇషాంత్ శర్మ కూడా టీమ్‌లోకి ఎంపికయ్యారు. వ్యక్తిగత కారణాలతో రెస్ట్ అడిగినా.. మున్ముందు కీలక టెస్ట్‌లు ఉండటంతో కోహ్లీని జట్టుతోనే కొనసాగించారు సెలెక్టర్లు. రోహిత్ శర్మ వైస్ కెప్టన్‌గా వ్యహరిస్తున్నాడు.
న్యూజీలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపిక
విరాట్ కోహ్లీ (కెప్టెన్), ధవన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బూమ్రా, మహ్మద్ సిరాజ్, ఆశిష్ నెహ్రాలను సెలక్టర్లు ఎంపిక చేశారు.
శ్రీలంకతో రెండు టెస్టులకు టీమిండియా జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్, పుజారా, రహానే, రోహిత్ శర్మ, వ్రిద్ధమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్రజడేజాలను సెలక్టర్లు ఎంపిక చేశారు.