తొలి వన్డేలో పరాజయంతో తీవ్ర ఒత్తిడిలో పడిన టీమ్ ఇండియా ఇప్పుడు లెక్క సరిచేయడంపై దృష్టిపెట్టింది. దీనికోసం గత మ్యాచ్‌లో చేసిన తప్పులను సవరించుకునేందుకు సిద్ధమైంది. ఇక కివీస్ పరిస్థితి మెరుగ్గా ఉంది. మేటి జట్లు బోల్తా కొట్టిన ఈ పిచ్‌లపై ఇద్దరే ఇద్దరు టీమ్ఇండియాను ఊడ్చేశారు. దీంతో ఈ మ్యాచ్‌తోనే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. కాబట్టి భారత్ ఏమాత్రం అలసత్వం చూపినా సిరీస్ చేజారినట్లే..! పుణె వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
