వైద్యారోగ్య శాఖను పరిపుష్టం చేశామని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు . శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో సిజేరియన్ శస్త్ర చికిత్సల వల్ల ఆస్పత్రుల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదని ఉద్ఘాటించారు. గతంలో ప్రభుత్వాలు వైద్యారోగ్య శాఖను నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రులను నిర్లక్ష్యం చేసి ప్రయివేటు ఆస్పత్రులను ప్రోత్సహించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులను బోలపేతం చేస్తూ.. నార్మల్ డెలివరీలను ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు. ఆధునాతన ఆస్పత్రులు, అత్యాధునిక బ్లడ్ బ్యాంక్‌లు ఏర్పాటు చేశామన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా గర్భిణులకు ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.
