తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన యువనాయకుడు ఒకరు దారుణానికి ఒడిగట్టాడు .కేవలం తనకు భార్య ఉన్నా మరో పెళ్ళి చేసుకోవడమే కాకుండా నిలదీసిన భార్యను అత్యంత దారుణంగా కొట్టి తన ఇంటి నుండి గెంటివేశారు. ఈ సంఘటన నగరంలో మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో జరిగింది.
బోడుప్పల్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండే పులకండ్ల శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో యువజన విభాగంలో పనిచేస్తున్నారు.నగరంలో చందానగర్‌కు చెందిన సంగీతను నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వారికి రెండేళ్ల పాప ఉంది. ఇదిలా ఉండగా శ్రీనివాస్ రెడ్డి మరో యువతిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురావడమేగాక ఆడపిల్ల పుట్టిందంటూ సంగీతను దారుణంగా కొట్టి ఇంటినుండి గెంటివేశారు. తీవ్రంగా గాయపడిన సంగీత తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటి ముందు ఆందోళన చేపట్టింది..అయితే , శ్రీనివాస్ రెడ్డి పరారీలో ఉన్నారు.