కేసీఆర్ నవంబర్ 29నాడు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వల్లనే డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిందని తెరాస డెన్మార్క్ అధ్యక్షుడు శ్యామ్ బాబు ఆకుల అన్నారు.
డెన్మార్క్ లో నిన్న మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఉపాధ్యక్షుడు సతీష్ గామినేని ఆధ్వర్యంలో దీక్ష దివాస్ నిర్వహించారు. శ్యామ్ మాట్లాడుతూ ఉద్యమ సమయం లో కేసీఆర్ తెలంగాణ వచ్చుడో కెసిఆర్ చచ్చుడో అని అంతిమ నినాదం తో ఆమరణ నిరాహార దీక్ష చేసి,చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఇప్పించారు. ప్రకటన వచ్చినంక ఎదురైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు జేఏసీ ఏర్పరచి, తెలంగాణ తీసుకవచ్చిన విషయం అందరికి తెలుసని అన్నాడు.భారత జాతిపిత మహాత్మ గాంధీ చూపిన అహింస మార్గం లో ఉద్యమం నడిపి తెలంగాణ సాధించి తెలంగాణ జాతిపిత అయ్యారు అని అన్నారు.
తదనంతరం డెన్మార్క్ తెరాస నాయకులందరు కలిసి కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్, జై కేసీఆర్ జై జై తెలంగాణ అని.. కేసీఆర్ తెలంగాణ దేవుడని నినాదాలు చేస్తూ కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు.ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి ప్రసాద్ కలకుంట్ల ,శివ గడ్డం,సంతోష్ గంజి,జాగృతి అధ్యక్షుడు సంతోష్ బోయినపల్లి,చందు పల్లె,విశాల్,దామోదర్ కనుకుల,నరేందర్ బోళ్ల,సునీల్ మహాజన్ మరియు ఇతరులు పాల్గొన్నారు.