తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని హుస్సేన్ సాగర్‌లోగల బుద్ధ విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం సందర్శించారు. నిన్నరాత్రి జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు హాజరైన రాష్ట్రపతి… రాత్రి రాజ్‌భవన్‌లో బస చేశారు. అనంతరం బుధవారం ఉదయం బుద్ధ విగ్రహాన్ని సందర్శించారు.ఈ సందర్బంగా పార్కు ప్రధాన ద్వారంతో పాటు లోపల పచ్చిక, ప్యాచ్‌వర్క్‌లను హెచ్‌ఎండీఏ ఆధునికీకరించింది. బుద్ధ విగ్రహం ప్రాంగణంలో పచ్చదనంతో పాటు చుట్టూ పూలమొక్కలను ఏర్పాటు చేసి గ్రానైట్ ఫ్లోరింగ్‌ను పూర్తి గా మార్చారు.రాష్ట్రపతి వెంట గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ తదితరులున్నారు.
