తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మెట్రో ప్రాజెక్టు చేపట్టిన ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థకు ఏబీసీఐ నేషనల్ అవార్డు దక్కిం ది. అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ కమ్యూనికేటర్స్ ఆఫ్ ఇండియా (ఏబీసీఐ)కు జాతీ య అవార్డును ఇటీవల ముంబాయిలో జరిగిన కార్యక్రమంలో అం దజేశారు. వెబ్ కమ్యూనికేషన్, ఆన్‌లైన్ క్యాంపెయిన్, సోషల్ మీ డియా, పీఆర్, బ్రాండింగ్ అంశాల్లో చేసిన ప్రచారానికి ఈ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డు కోసం ఇండియా నుంచి పలు కా ర్పొరేట్ సంస్థలు, బ్యాంకులు, పీఎస్‌యూ కంపెనీలు పోటీ పడినా, చివరకు తమకే అవార్డు దక్కడం సంతోషంగా ఉందని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
