తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త ,నల్లగొంగ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీనివాస్ హత్య నిన్న రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో హత్య చేసిన ప్రధాన నిందితులు జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయారు.వివరాల్లోకి వెళ్తే..శ్రీనివాస్ ను హత్య చేసిన తరువాత మొదటగా నిన్న గోపి ,చక్రి,దుర్గయ్య ,మోహన్ లను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా ఈ కేసులో మల్లేష్, శరత్, రాంబాబు అనే ముగ్గురు ప్రధాన నిందితులు పోలిస్ స్టేషన్ లో లొంగిపోయారు.
