టీఎస్ ఐసెట్-2018 సంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్ ను ఇవాళ వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. తెలుగు, ఇంగ్లీష్ తో పాటు ఉర్దూ భాషలో పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ నెల 22 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తామని, ఏప్రిల్ 30వ తేదీ దరఖాస్తుకు చివరి తేదీ అని చెప్పారు. మే 23, 24 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని, జూన్ 6న పలితాలు విడుదల చేస్తామన్నారు. టీఎస్ ఐసెట్ పరీక్షను రాష్ట్రంలో మొదటిసారి ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నామని ఈ సందర్బంగా ప్రకటించారు.