Home / POLITICS / చరిత్రను తిరగరాస్తున్న సుపరిపాలన..!

చరిత్రను తిరగరాస్తున్న సుపరిపాలన..!

తెలంగాణ ప్రజల సంక్షేమం,అభివృద్ధే ద్యేయంగా …ఆశగా … శ్వాసగా … ప్రతి నిమిషం తనకున్న అద్భుతమైన మానవీయ సద్గుణాలతో ఇప్పటికే చరిత్ర లో సముచితమైన స్థానం సంపాదించుకున్న తెలంగాణ రథసారధి , ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే కొన్నేళ్లలో భారత దేశం గర్వించదగిన స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చి దిద్దబోతున్నరు . భేషజాలకు పోకుండా ఆలోచిస్తే … దేశ రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరూ పరిశోధన చేయగలిగే అత్యున్నత స్థాయి నాయకుడు కేసీఆర్ . సింపుల్ గా చెప్పాలంటే మల్టీ టాలెంటెడ్ డైనమిక్ పొలిటికల్ లీడర్ . ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి ముఖ్యంగా పాలకుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం మానవత్వం . అది ఆయన గుండెల నిండా కనిపిస్తుంది . తెలంగాణ లో ఆయన ఆలోచనల నుండి ఉద్భవించిన సంక్షేమ పథకాలను లోతుగా పరిశీలిస్తే పేద ప్రజల పట్ల ఆయనకు ఎంత ప్రేమ ఉందో … ఎంత సాఫ్ట్ కార్నర్ ఉందో స్పష్టంగా అర్ధమవుతుంది . తెలంగాణ లో ఉన్న సుమారు కోటి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ఆయన సంక్షేమ , అభివృద్ధి పథకాలకు డిజైన్ చేస్తున్న తీరు అద్భుతమని చెప్పాలి .

వృద్దులు , వికలాంగులు , వితంతువులు , ఒంటరి మహిళలు , బీడీ కార్మికులు 40 లక్షల మందికి నెలనెలా 1000 , 1500 చొప్పున అందిస్తున్న పెన్షన్ కోటిలో నలభై శాతం కుటుంబాలకు పెద్ద ఊరట , దైర్యం అందిస్తున్నది . ఇక పెళ్లీడుకొచ్చిన ఆడబిడ్డలకు ఆసరాగా నిలవడానికి ప్రారంభంలో రూ . 51000 , ఇప్పుడు రూ. 75000 అందిస్తూ ఎస్సీ , ఎస్టీ , బీసీ , ఓసీ లోని పేదలందరికీ వర్తింప జేస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం ఎన్నో కుటుంబాలకు కొండంత ధైర్యాన్ని అందిస్తున్నది . ఇక 24 గంటల విద్యుత్తు విషయంలో తెలంగాణ రాష్ట్రం చరిత్రనే తిరగరాసింది . అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇవ్వడమే కాకుండా రైతన్నల కోసం ఉచిత విద్యుత్ అందిస్తున్నది . గృహ వినియోగదారులు , రైతులు , పారిశ్రామిక , వ్యాపార వర్గాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కారణంగా విద్యుత్తు ఫలాలను అనుభవిస్తున్నరు . పేద ప్రజలకు వైద్య సేవలు అందించడం కోసం అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకాన్ని గత ప్రభుత్వాల కంటే ఇంకా భారీగా నిధులు కేటాయిస్తూ అద్భుతమైన సేవలను అందిస్తున్నది . మరో కొద్ది నెలల్లో కోటి కుటుంబాలకు పూర్తి స్థాయిలో తాగు నీటిని అందించే మిషన్ భగీరథ భారత దేశ తాగు నీటి చరిత్రను సరికొత్తగా ఆవిష్కరించబోతున్నది .

తెలంగాణ అభివృద్ధి సమగ్ర స్వరూపాన్నే మార్చివేయబోతున్న సాగు నీటి రంగం ఇక ఇప్పటికే రికార్డులను సృష్టిస్తున్నది . కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు ఇంత త్వరగా పూర్తవుతున్న దాఖలాలు ఆసియాలోనే ఎక్కడా లేవు . సుమారు 60 లక్షల కుటుంబాలకు ప్రత్యక్షంగా , మరో 10 లక్షల కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి కల్పించే సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ తెలంగాణ వ్యవసాయ , ఆర్ధిక రంగ ముఖ చిత్రాన్నే మార్చబోతున్నది . తన కోటి ఎకరాల సాగు సంకల్పంతో తెలంగాణ రైతులకు రాబోయే రెండు , మూడేళ్ళలోనే సుమారు 20 లక్షల కోట్ల మేర భూముల విలువ పెరగడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణం కాబోతున్నరు . సాగు నీరు ఎన్నో లక్షల కుటుంబాలకు ఊపిరి పొయనున్నది . ఎకరానికి రూ . 8 వేల పెట్టుబడి అనే ఒక అద్భుతమైన పథకానికి ముఖ్యమంత్రి అంకురార్పణ చేయడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నది . భారీ స్థాయిలో గురుకుల విద్యాలయాల స్థాపన , ఫీజు రీ అంబర్స్ మెంట్ , మిషన్ కాకతీయ , గొర్రెల పంపిణీ , చేనేతకు చేయూత , శాంతి భద్రతలు , కేసీఆర్ కిట్ , ప్రభుత్వ ఆస్పత్రులకు భారీగా నిధుల కేటాయింపు , రేషన్ బియ్యం సహా ఎన్నో సంక్షేమ , అభివృద్ధి పథకాలతో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం మెరుపువేగంతో దూసుకుపోతున్నది . ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి అన్ని రంగాల్లో దిక్సూచిగా నిలిచే బ్రాండ్ అంబాస్డర్ గా నిలవబోతున్నది .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat