దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. తనకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పదవి అప్పగించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగిందన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఉంటదనే విషయం ఎవ్వరికీ తెలియదన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, వాటిని ప్రజల దగ్గరకు తీసుకెళ్తానని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సభ్యుల ప్రమాణ స్వీకారణోత్సవ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్ర భారతిలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, జగదీష్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ మల్లారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.