ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప‌్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయి..ఆయా నియోజకవర్గాల్లో సీఎం రిలీఫ్ ఫండ్‌కు అప్లై చేసుకున్న వారికి స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఆర్థిక సాయానికి సంబంధించి చెక్‌లు ప్రభుత్వం అందజేస్తుంది.
see also :మంత్రి కేటీఆర్ అన్నదాంట్లో తప్పు లేదు..
ఈ క్రమంలో వరంగల్ పచ్చిమ నియోజకవర్గంలోని హన్మకొండలో కొత్తగా నిర్మాణం చేపట్టిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రాంగణంలో రూ.28 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను 11 మంది లబ్ధిదారులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాస్యం మాట్లాడుతూ..రాష్ట్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు భయపడవద్దని.. ప్రభుత్వం తరపున ఆర్ధిక సహాయం అందిస్తామని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
see also :దేశంలోనే తొలిసారి ..పోస్టు పెట్టాడు ..అరెస్టు అయ్యాడు..!