తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లిలో రూ.48 కోట్లతో చేపట్టిన భగీరథ మంచినీటి ట్యాంకుకి వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నమే భగీరథ పథకం మంచినీరన్నారు.
ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిని అందించే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. దీని ద్వారా ఆరోగ్యకర సమాజ నిర్మాణం జరుగుతుందన్నారు. నీటి ద్వారా వ్యాపించే 30 రకాల వ్యాధులకు భగీరథ మంచినీటి ద్వారా చెక్ పెట్టొచ్చన్నారు. మిషన్ భగీరథ ద్వారా జడ్చర్ల, బాదేపల్లిలలో 9 వేల కుటుంబాలకు ఆరోగ్యకర నీరు అందనున్నట్లు చెప్పారు.ఆరోగ్యకర నీటితో 30 రకాల రోగాలకు చెక్ పెట్టవచ్చని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.