తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని చారిత్రక మోజంజాహీ మార్కెట్ ను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రూ.10 కోట్ల ప్రాథమిక అంచనాతో జీహెచ్ఎంసీ పునరుద్ధరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మోజంజాహీ మార్కెట్ ను సందర్శించారు. మార్కెట్ మొత్తం తిరిగి పరిశీలించారు. చేపట్టబోయే పనుల గురించి అడిగి తెలుసుకొని, పలు సూచనలు చేశారు. మార్కెట్ లోని వ్యాపారులతో ముచ్చటించారు.ఈ సందర్భంగా మ్.జె. మార్కెట్ లో ఐస్ క్రీమ్ రుచి చూశారు.మంత్రి కేటీఆర్ వెంట మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ అధికారులు ,తదితరులు ఉన్నారు.
MA&UD Minister @KTRTRS along with @arvindkumar_ias, Principal Secretary, MA&UD inspected The Mozzam Jahi Market. The government is set to take up restoration works of Hyderabad’s iconic landmark, MJ Market. pic.twitter.com/zfvXuhPdmJ
— Min IT, Telangana (@MinIT_Telangana) April 16, 2018