ఆయనో ప్రభుత్వ అధికారి,ఆపై జిల్లా కలెక్టర్ రోజు ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలు,మీటింగ్ లతోవిరామం లేకుండా బిజీ బిజీ గా గడుపుతూ ఉంటారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మంచిపేరు సంపాదించుకున్నారు.ఇంతకీ ఎవ్వరానుకున్తున్నారా..? ఆయనే తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. ఇవాళ అయన మానవత్వాన్ని చాటుకున్నారు. సంగారెడ్డి పట్టణంలో రోడ్లపై అనాథలుగా తిరుగుతున్న వారిని చేరదీశారు. వారికి అన్నపానియాలు అందించారు.అంతేకాకుండా వారికి క్షవరం చేయించి స్నానం కూడా చేయించారు. ఆ తరువాత వారికి కొత్తబట్టలు ఇచ్చి పునరావస కేంద్రానికి తరలించారు. జిల్లా వ్యాప్తంగా రోడ్లపై తిరిగే అనాథలను గుర్తించి పునరావాస కేంద్రాల్లో చేర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ ఈ విధంగా చేయడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.హ్యాట్సాఫ్ అంటూ కొనియాడుతున్నారు.
