కాంగ్రెస్ పార్టీకి కొత్త సమస్య ఒకటి వచ్చిపడింది. అదే పరువు సమస్య. తమకు ఎలాగూ ఆదరణ లేదు కాబట్టి అధికార టీఆర్ఎస్ పార్టీని పలుచన చేయాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అయితే చిత్రంగా కాంగ్రెస్ నవ్వుల పాలు అవుతోంది. ఇప్పటికే ఎన్నో దఫాలు జరిగినప్పటికీ బుద్ధిరాని కాంగ్రెస్ పార్టీ తాజాగా టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ఇదే పని చేసి కామెడీ అయిపోయిందనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ ప్లీనరీకి అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ ఓ ప్రచారాన్ని మొదలుపెట్టింది. అదే టీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త ఎమ్మెల్సీ కొండా మురళీ కాంగ్రెస్ గూటికి చేరడం.
ఈనెల 25వ తేదీన వారు ఢిల్లీ వెళ్లనున్నారని, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని ఆ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది. టీఆర్ఎస్ పార్టీలో వారికి నిరాదరణ ఎదురవుతోందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని తనదైన శైలిలో సోషల్ మీడియాలో వైరల్ చేసింది. అయితే ఈ విషయంపై కొండా దంపతులు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. తమకు పార్టీ మారే ఆలోచన ఏదీ లేదని…ఈ విషయంలో తమపై దుష్ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేని కాంగ్రెస్ ఇలాంటి ప్రచారానికి దిగుతోందని అన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ పార్టీలోనే తాముంటామని స్పష్టం చేశారు.