Home / TELANGANA / రైతును రాజును చేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం..!!

రైతును రాజును చేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం..!!

రైతు బంధు పథకం అమలుతో ఈ నెల 10వ తేదీన తెలంగాణ ప్రభుత్వం దేశంలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. పంట పెట్టుబడి కోసం రైతులకు ఆర్థిక సా యం అందజేయబోతున్న తొలి రాష్ట్రం దేశంలో తెలంగాణ కాబోతుండటం విశేషమని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును రైతు బాంధవుడిగా అభివర్ణించారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చటం, రైతును రాజును చేయటమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని కడి యం అన్నారు. పంట పెట్టుబడి సాయం పంపిణీతో తెలంగాణ రాష్ట్రం దేశంలో చరిత్ర సృష్టించనుందని తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరిగే రైతు బంధు పథకం అమలుపై భూపాలపల్లిలోని ఏఎస్‌ఆర్ గార్డెన్స్‌లో జిల్లా స్థాయి అవగాహన సదస్సు జరిగింది. జిల్లా కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్ సదస్సుకు అధ్యక్షత వహించారు. జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల వ్య వసాయాధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లా, మండల రైతు సమన్వయ సమితుల అధ్యక్షులు, మం డలాల ప్రత్యేక అధికారులు సదస్సుకు హాజరయ్యా రు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉపముఖ్యమంత్రి కడి యం శ్రీహరి సదస్సులో మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, వ్యవసాయం గురించి తెలిసిన, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహ న ఉన్న వ్యక్తిగా వ్యవసాయాన్ని పండుగలా మార్చే దిశలో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. నాడు తెలంగాణ కోటి రతనాల వీణ అని కవి దాశరథి అంటే నే డు నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అని కేసీఆ ర్ అంటున్నారని తెలిపారు.

తమ సమర్ధవంతమైన పాలనతో తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారని, దేశంలో మరే రాష్ట్రంలో లేని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి తెలంగాణలో అమలు చేస్తున్నారని కడియం అన్నారు. రాజకీయాలకు అతీతంగా త మ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అ మలు చేస్తున్నట్లు శ్రీహరి చెప్పారు. కష్టపడి తెచ్చుకు న్న తెలంగాణను ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలనే పట్టుదలతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారన్నారు. సమైక్య పాలనలో రైతుల ఆత్మహత్యలు దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉండేవని, తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రైతు ఆత్మహత్యలకు కారణాలను గుర్తించి అరికట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయన్నారు. ఇది నేను చెప్పడం లేదని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓ సంస్థ ఈ వాస్తవాన్ని చెబుతోందని కడియం అన్నారు. 2008లో స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని సీపతిపల్లికి చెందిన ఉప్పలయ్య అనే రైతు ఎరువుల బస్తాల కోసం స్టేషన్ ఘన్‌పూర్‌లోని ఓ ఫర్టిలైజర్ దుకాణానికి వచ్చి ఆ దుకాణంలో ఎరువులు లేకపోవ డంతో మరో దుకాణంలో ఎరువులు ఉన్నాయనే స మాచారంతో పరుగు తీసి ఆయాసంతో గుండెపోటు వచ్చి మరణించాడని తెలిపారు. దీంతో అప్పట్లో రైతులతో కలిసి తాను స్టేషన్ ఘన్‌పూర్‌లో ధర్నా చేసినట్లు చెప్పారు.

ఆ కేసు ఇప్పటికీ తనపై ఉందన్నారు. ఇ లాంటి ఘటనలు ఎన్నో గతంలో జరిగాయని డిప్యూ టీ సీఎం అన్నారు. సమైక్య పాలనలో వ్యవసాయానికి రోజుకి కనీసం ఆరు గంటల కరెంటు సరఫరా కూడా జరిగేది కాదన్నారు. లోఓల్టేజీతో పంపుసెట్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయేవని, విద్యుత్ కోసం రైతులు రోడ్డెక్కి సబ్‌స్టేషన్లు, తహసీల్దార్ కార్యాలయాలు, రహదారులపై ధర్నాలు నిర్వహించే వారన్నా రు. గత నాలుగేళ్లలో గుణాత్మక మార్పు జరిగిందన్నా రు. వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోందని తెలిపారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో చీకట్లు కమ్ముకుంటాయని సమైక్యవాదులు అన్నారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణలో వ్యవసాయానికి రోజుకి ఆరు గంటలు కాదు 24గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తూ సమైక్యవాదులు చెప్పింది నిజం కాదని నిరూపించారన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో పెడుతున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ చేశారని, రాష్ట్రంలో రూ.16,250 కోట్ల పంట రుణాలను మాఫీ చేయటం వల్ల 38లక్షల మంది రైతులు లబ్ధిపొందారని శ్రీహరి తెలిపారు.