పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే నిండు పార్లమెంట్ లోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు.రాష్ట్ర విభజన విషయంలో కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఏపీ ఒత్తిడి చేసినప్పుడల్లా కేసీఆర్ పరిణతితో వ్యవహరించారన్నారు. చంద్రబాబు… వైసీపీ ఉచ్చులో పడ్డారన్న మోడీ.. ఆయన తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు.
ప్యాకేజీని స్వయంగా ముఖ్యమంత్రే ఆహ్వానించారన్నారు. ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీకి కట్టుబడి ఉన్నామన్నారు. స్పెషల్ ప్యాకేజీకి చంద్రబాబు సర్కార్ ధన్యవాధ తీర్మానం చేసి పంపిందన్నారు మోడీ.ఎన్డీయే నుంచి బయటకు రాగానే స్వయంగా చంద్రబాబుకి ఫోన్ చేసినట్లు చెప్పారు.
కాంగ్రెస్ పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించిందన్నారు. తెలుగు ప్రజలకు భరోసా ఇచ్చేలా విభజించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారన్న విషయాన్ని అప్పుడూ చెప్పాను, ఇప్పుడూ చెప్తున్నానన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అభివృద్దిలో లోటు రానివ్వమని మోడీ తెలిపారు.