కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇవాళ బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి, రుద్రూరు మండలాల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఈ ఘర్షణ జరిగింది.. కాసుల బాలరాజ్, మాల్యాద్రి రెడ్డి వర్గాలు ఒకరిని ఒకరు తోసుకుంటూ తిట్టుకున్నారు. ఎవరికి వారు అనుకూల నినాదాలు చేస్తూ రచ్చరచ్చ చేశారు. బాన్సువాడ టికెట్ ఎవరికి ఇస్తారని ఆ పార్టీలోని కొందరు కార్యకర్తలు అడగటం, సీనియర్ కే టికెట్ ఇవ్వాలని మరో వర్గం అనడంతో మాటకు మాట పెరిగి గొడవ పెద్దదైంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తాహెర్, మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ సమక్షంలోనే రెండు వర్గాల కార్యకర్తలు గొడవ పడుతున్నా ఎవరూ జోక్యం చేసుకోలేదు.
