భారత దేశంలో గుణాత్మక మార్పు కోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు టీఆర్ఎస్ ఎన్నారై సాతాఫ్రికా శాఖ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై సాతాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్‌కు తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందన్నారు. 14 ఏండ్లు పోరాటం చేసి తెలంగాణను సాధించిన కేసీఆర్‌కు దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడం లెక్క కాదన్నారు. ప్రాంతీయ పార్టీలన్నింటిని ఒకే గొడుగు కిందకు కేసీఆర్ తీసుకురావడం ఖాయమన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడుతుందన్న విశ్వాసం తమకు ఉందని నాగరాజు స్పష్టం చేశారు.
