తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.మొత్తం 4,137 పంచాయతీలలో ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడగా,వీటిలో ఏడుగురు నామినేషన్లు దాఖలు చేయలేదు..కాగా 788 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.దీంతో మిగిలిన 3,342 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.సర్పంచి అభ్యర్థులు సంఖ్య 10,317 ఉండగా 63,380 మంది వార్డు మెంబెర్స్ ఉన్నారు.వివాదాస్పద ప్రాంతాలలో గల పంచాయతీల్లో 673 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు.మొత్తంగా 29,964 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది.అనతరం 2 గంటల నుండి ఓట్లు లెక్కింపు ఆ తరువాత అధికారులు ఉప సర్పంచి ఎన్నికను నిర్వహిస్తారు.ఈ మేరకు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
10,317 మంది సర్పంచి అభ్యర్థులు, 63,380 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండో విడతలో మొత్తం 4,137 పంచాయతీలలో ఎన్నికల కోసం నోటిఫికేషన్లు వెలువడగా, వాటిలో 788 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఏడు సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా 3,342 సర్పంచి స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. సమస్యాత్మక ప్రాంతాలు, వివాదాస్పద పంచాయతీల్లోని 673 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. 29,964 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంటవరకు పోలింగ్ కొనసాగనుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. అనంతరం ఉప సర్పంచి ఎన్నికను అధికారులు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.