మాజీ మంత్రి హరీశ్‌రావును టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెచ్చుకున్నారు.బుధవారం సిద్ధిపేట జిల్లా కేంద్రంలో హరీష్ రావుతో పాటు స్థానిక కలెక్టర్ కృష్ణభాస్కర్ సమీకృత మార్కెట్ యార్డును ప్రారంభించారు. ఆ మార్కెట్‌కు సంబంధించిన ఫోటోలను హరీశ్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు తగినట్టుగా ఆ మార్కెట్‌ను నిర్మించారు.సుమారు 20 కోట్ల వ్యయంతో ఈ సమీకృత మార్కెట్ బిల్డింగ్‌ను నిర్మించారు ఒకే చోట కూరగాయలు, మాంసాన్ని విక్రయించేందుకు భారీ మార్కెట్‌ను అత్యాధునికంగా నిర్మించారు.మార్కెట్ యార్డు ఫోటోలను పోస్టు చేయడంతో.. హరీష్ ట్వీట్ పై ఈ రోజు ఉదయం కేటీఆర్ స్పందించారు. మార్కెట్ యార్డ్ అద్భుతంగా ఉన్నాయని హరీశ్‌ను కేటీఆర్ మెచ్చుకున్నారు. సమీకృత మార్కెట్‌ను సుందరంగా తీర్చిదిద్దినందుకు ఇవే నా కాంప్లిమెంట్స్ అంటూ కేటీఆర్ రీట్వీట్ చేశారు.
