మార్చి2వ తేదీన తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు భువనగిరి ఎంపీ బూర నరసయ్య గౌడ్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటన లో తెలిపారు. పుల్వామా ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. తన అభిమానులు, పార్టీ కార్యా కర్తలు తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని, కేకులు కట్ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి బదులు రక్తదానాలు చేయాలని ,భారత్ సైనికులకు .మద్దతుగా ర్యాలీలు నిర్వహించాలని డాక్టర్ బూర నరసయ్య గౌడ్ సూచించారు.
