రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం జగిత్యాల జిల్లా రాంపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పంప్‌హౌస్‌ను పరిశీలించారు. పనుల పురోగతిపై నవయుగ ఛైర్మన్ సి.విశ్వేశ్వరరావుతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. అనంతరం మేడిగడ్డ చేరుకుని వ్యూ పాయింట్ నుంచి బ్యారేజీ పనులను పరిశీలించారు. పెండింగ్ పనుల పూర్తికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బ్యారేజి పనులను దాదాపు 90శాతం వరకు పూర్తయ్యాయని అధికారులు సీఎం కేసీఆర్ కు వివరించారు.
