Home / POLITICS / ఆరోగ్య తెలంగాణకు చింతమడక నుంచే తొలి అడుగు..!!

ఆరోగ్య తెలంగాణకు చింతమడక నుంచే తొలి అడుగు..!!

 సిద్ధిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో యశోద ఆసుపత్రి వారి సౌజన్యం తో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ముగింపు కార్యక్రమంలో   మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిశ్ రావు   మాట్లాడుతూ. “ఆరోగ్య తెలంగాణకు అడుగులు సీఎం స్వగ్రామం నుండే… చింతల్లేని తెలంగాణ…చింత మడక నుండే… ఇదొక చారిత్రాత్మకం… ఆరోగ్య సూచి..దేశంలోనే ప్రథమం. మొట్టమొదటి సారిగా మన చింత మడక, మాచపూర్ , సీతారాం పల్లి నుండే ఆరంభం. దేశంలోనే గ్రామ ప్రజల అన్ని రకాల మౌలిక పరీక్షలు చేసి ఆరోగ్య సూచిక చేసినా మొదటి గ్రామం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో చేయాలని సీఎం కేసీఆర్ భావించారు. ఇంగ్లండ్, అమెరికా లాంటి దేశాల తర్వాత మన దగ్గర మొదటప్రారంభం అయింది..కేసీఆర్ గారి కృషి వల్ల చింత మడక గ్రామానికి యశోద ఆసుపత్రినే తీసుకువచ్చారు. యశోద ఆసుపత్రి వారుకోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి మనకు ఈ క్యాంప్ నిర్వహించినందుకు కృతజ్ఞతలు. 8రోజుల్లో 5, 561 మందికి 36, 146 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. చేసిన పరీక్షలను వారం రోజుల పాటు ఏవేల్యూవేషన్ చేసి సూపర్ స్పెషాలిటీ వైద్యులచే చికిత్స అందిస్తాం. కేసీఆర్ చెప్పిన మాటకు కట్టుబడి ప్రజలందరికీ మంచి ఆరోగ్యసూచిక అందిస్తున్నారు. ఈ గ్రామాన్ని శుభ్రం చేస్తే100 ట్రాక్టర్ ల చెత్తా చెదారం లభించింది. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత,శుభ్రత, పరిసరాల శుభ్రత అవసరం. జబ్బులు రాకుండా చూసుకునే బాద్యత మనపైనే ఉంది. గ్రామంలో తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలి… ప్రతి ఒక్కరి ఇల్లు అద్దం లా కనపడాలి. 2018-2019 లో ఇబ్రహీంపూర్ గ్రామంలో ఒక్కరికి కూడా జ్వరం రాలేదు, ఆ గ్రామం అంతా పరిశుభ్రంగా ఉంది. ఆరోగ్య తెలంగాణ దిశగా ఈ గ్రామం శుభ్రంగా ఉండేలా ప్రజలు కృషి చేయాలి. వారం రోజుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యులచే చికిత్స అవసరం ఉన్నవారికి శిబిరం నిర్వహిస్తాం. గ్రామస్థులకు ఇచ్చిన మందులను తూచా తప్పకుండా వాడాలి. త్వరలోనే గ్రామ అభివృద్ధి కోసం సమావేశం నిర్వహిస్తాం.ఈ గ్రామంలో మొదటి కార్యక్రమం హెల్త్ క్యాంప్ తో ప్రారంభం చేసుకున్నాం”అని అన్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat