క్రికెట్ దిగ్గజాలైన డాన్ బ్రాడ్‌మన్, సచిన్‌కు ఈ రోజు ఎంతో ప్రత్యేకం. ఆసీస్ దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ తన ఆట తీరుతో క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయాడు. తానూ ఆడిన 52 టెస్టుల్లో 99.94 సగటుతో 6996 పరుగులు సాధించారు. ఇందులో ఏకంగా 29 సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ దిగ్గజ ఆటగాడు ఆటకు స్వస్తిపలికి 71 ఏళ్లు అవుతున్నా ఆయన రికార్డు మాత్రం ఇంకా అలానే ఉంది. అలాంటి వ్యక్తి ఇదే రోజున ఆఖరిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాట్‌పట్టడం జరిగింది. 1948 ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌నే తన ఆఖరి మ్యాచ్. ఈ దిగ్గజ ఆటగాడికి ఇంగ్లాండ్ ఆటగాళ్లు వారి క్యాప్‌లను తీసి బ్రాడ్‌మన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. బ్రాడ్‌మన్ తరువాత అంతటి దిగ్గజ ఆటగాడిగా ఎవరైనా పేరు తెచ్చుకున్నారు అంటే అది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నే. వంద శతకాలు కొట్టిన సచిన్ టెస్టుల్లో తన మొదటి సెంచరీ ఆగష్టు 14నే సాధించాడు. 1990 లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో సచిన్ శతకం సాధించాడు.
