నేటి నుండి సద్దుల బతుకమ్మ వరకు తెలంగాణ వ్యాప్తంగా 300 చోట్ల తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరుగనున్నాయి. తెలంగాణ కు అవతల దేశ విదేశాల్లో 12 చోట్ల జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహిసారు. బతుకమ్మ పండుగ సందర్భంగా సెప్టెంబర్ 30న ఉదయం రవీంద్రభారతిలో 316 మంది కవయిత్రుల రాసిన బతుకమ్మ కవితలతో తెలుగు సాహితీరంగంలో అతిపెద్ద కవయిత్రుల కవితా సంకలనం * పూల సింగిడీ* ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుంది. అదే రోజు రవీంద్రభారతి మెయిన్ మరియు కాన్ఫరెన్స్ హాల్‌లో ఉదయం నుండి సాయంత్రం వరకు 316 మంది కవయిత్రులు రాసిన కవితలు పఠనం చేస్తారు. ఇక అక్టోబర్ 2, 3 మరియు 4 తేదీలలో జేఎన్ యూ ఫైన్ ఆర్ట్స్ లో మూడు రోజుల పాటు 50 మంది మహిళ ఆర్టిస్టులచే ఆర్ట్ వర్క్ షాప్ నిర్వహిస్తారు.ఇప్పటికే బతుకమ్మ సంబురాల గోడపత్రిక సహా బతుకమ్మ పాటల పుస్తకం, సీడీ, మొబైల్ యాప్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత విడుదల చేశారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు మొదలైన సందర్భంగా 33 జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాల వేదికల వివరాలను విడుదల చేశారు. 33 జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్న బతుకమ్మ సంబురాల వేదికలను, కోఆర్డినేటర్ల వివరాలను జాగృతి సంస్థ ప్రకటించింది. కాగా తెలంగాణ ఉద్యమ సమయంలో నాలుగు కోట్ల ప్రజల అస్థిత్వంగా బతుకమ్మ పండుగను చాటడంలో… విశ్వవ్యాప్తంగా కీర్తి తీసుకురావడంలో తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత ప్రముఖ పాత్ర వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా తెలంగాణ జాగృతి సంస్థ బతుకమ్మ సంబురాలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో అంగరంగవైభవంగా నిర్వహించడం అభినందనీయం.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగనున్న బతుకమ్మ సంబురాల వేదికల కోసం ఈ క్రింది పీడీఎప్‌ను క్లిక్ చేయండి..!