తెలంగాణలో ఇప్పుడు హుజూర్‌నగర్ ఉప ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నల్లొండ పార్లమెంట్ స్థానానికి ఎన్నిక కావడంతో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్ 21 న హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్‌పై స్వల్ఫ మెజారిటీతో ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డినే అభ్యర్థిగా ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి హుజూర్‌నగర్ బరిలో నిలబడుతోంది. బీజేపీ అభ్యర్థిగా కోట రామారావు అభ్యర్థిత్వం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ కూడా హుజూర్‌నగర్ బరిలో దిగనుండడంతో చతుర్ముఖ పోటీ నెలకొంది. అయితే ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే నెలకొంది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నాడీ తెలుసుకునేందుకు దరువు మీడియా హుజూర్‌నగర్‌లో సర్వే నిర్వహించింది. ఈ నియోజకవర్గ ప్రజలు దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ పాలనపై ఇక్కడి ప్రజల్లో సానుకూలత నెలకొంది. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు, రైతుబంధు, పింఛన్లు, రైతు బీమా, కేసీఆర్ కిట్లు, గురుకులాలు…ఇలా అన్ని సంక్షేమ పథకాలు అందుతుండడంతో ప్రజలు టీఆర్ఎస్‌కు ఈసారి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. రెండుసార్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి గెలిచినా హుజూర్‌నగర్‌లో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని..ఇక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పైగా టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి స్థానికుడు కావడంతో పాటు…ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తాడన్న మంచి పేరు ఉంది.దీంతో ఈసారి సైదిరెడ్డికి అవకాశం ఇవ్వాలని హుజూర్‌నగర్ ప్రజలు డిసైడ్ అయ్యారు. హుజూర్‌నగర్‌లోని 7 మండలాల్లో కూడా టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనపరుస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో రైతుబంధు, రైతుబీమా, కరెంట్, సాగునీరు అందుతుండడంతో టీఆర్ఎస్ పట్ల సానుకూలత మరింతగా పెరిగింది. మొత్తంగా చూస్తే టీఆర్ఎస్‌కు, కాంగ్రెస్ పార్టీల మధ‌్య 12 శాతం ఓట్ల తేడా ఉంటుంది. ఇక బీజేపీకి 10 నుంచి 12 వేల ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓవరాల్‌గా అయితే ఇక్కడ కాంగ్రెస్ …రెండో స్థానానికే పరిమితం అవుతుందని, టీఆర్ఎస్ పార్టీ 20 వేల మెజారిటీతో గెలవడం ఖాయమని దరువు సర్వేలో వెల్లడైంది. దరువు సర్వే ఇప్పటివరకు నిర్వహించిన సర్వేలన్నీ వందకు వంద శాతం నిజం అయ్యాయి. హుజూర్‌నగర్‌లో కూడా దరువు చెప్పినట్లు టీఆర్ఎస్ గెలుస్తుందనడంలో సందేహం లేదు.
