Home / BAKTHI / వరంగల్‌లో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి ఆశీర్వాదం పొందిన టీఆర్ఎస్ ముఖ్య నేతలు…!

వరంగల్‌లో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి ఆశీర్వాదం పొందిన టీఆర్ఎస్ ముఖ్య నేతలు…!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీ స్మాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు తొలిసారిగా తెలంగాణ ధర్మ ప్రచార యాత్రను చేపట్టారు. ఈ మేరకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు ఉమ్మడివరంగల్‌ జిల్లాలో స్వామివారు పర్యటిస్తున్నారు. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు హన్మకొండలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు నివాసంలో నిర్వహిస్తున్న నవరాత్రుల ఉత్సవాలలో రాజశ్యామల అమ్మవారికి పీఠపూజ , అర్చన, హారతి, చండీ హోమం, చండీ పారాయణ, దుర్గా పూజ, గౌరీ పూజ, లలితా సహస్ర నామార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారు స్వయంగా తీర్థ ప్రసాదాలు ఇచ్చి భక్తులను ఆశీర్వదించి, అనుగ్రహ భాషణం చేస్తున్నారు. కాగా కెప్టెన్ ఇంట్లో స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని, ఆశీర్వాదం తీసుకుంటున్నారు, ఈ క్రమంలో ఇవాళ కెప్టెన్ ఇంట్లో కరీంనగర్ మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు శ్రీ వినోద్‌కుమార్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ తదితర నేతలు స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీస్‌కుమార్, ధర్మ ప్రచారయాత్ర సమన్వయకర్త , దరువు, కరన్‌ కాన్సెప్ట్స్ అధినేత చెరుకు కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.