ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో కొత్త వివాదానికి దారితీశాడు అనడానికి ఇదే ఉదాహరణ అని చెప్పాలి. ఉత్తర కొరియాలో అత్యంత ప్రమాదకరమైన పర్వతం ఏదీ అంటే అది ‘పయ్యేక్టు’ అనే చెప్పాలి. ఈ పూర్తిగా మంచుతో కప్పి ఉంటుంది మరియు చాలా ప్రమాదకరమైనిది కూడా. అయితే కిమ్ ఈ పర్వతంపై గుర్రపు స్వారీ చేసారని కేఎన్సీఏ వార్త వెల్లడించింది. ఇందులో చూసుకుంటే కిమ్ ఒక్కడే భయం లేకుండా అక్కడికి వెళ్లి స్వారీ చేసాడని తెలుస్తుంది. దీనికి సంభందించిన ఫోటోలు కూడా బయటపడ్డాయి. అయితే ఇంత ప్రమాదకరమైన కొండపై సాహసం చేసారంటే త్వరలో ఏదో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని అర్ధమని అక్కడి వారు చెప్పుకొచ్చారు. మరి కిమ్ ఎలాంటి ప్రకటన చేయబోతున్నాడో వేచి చూడాల్సిందే.
