Home / ANDHRAPRADESH / జగయ్యపేటలో గాంధీ సంకల్పయాత్ర ప్రారంభించిన బీజేపీ ఎంపీ..!

జగయ్యపేటలో గాంధీ సంకల్పయాత్ర ప్రారంభించిన బీజేపీ ఎంపీ..!

ఒకప్పటి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, (ఇప్పుడు కూడాలెండి), ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనాచౌదరి గారి చిత్రవిచిత్ర విన్యాసాలు చూసి ఏపీ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. బ్యాంకులకు 6 వేల కోట్లు ఎగ్గొట్టి, మనీల్యాండరింగ్ కేసుల్లో ఇరుక్కుని కేసుల భయంతో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఈ సుజనాచౌదరి గారు ఇప్పుడు జగ్గయ్యపేటలో మదిలో మహాత్ముడి పేరిట గాంధీ సంకల్పయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా సుజనాచౌదరి గారు ప్రాంతీయ పార్టీల గురించి పెద్ద లెక్చరే ఇచ్చాడు..ప్రాంతీయ పార్టీలతో అసలు ప్రయోజనమే ఉండదంట…ప్రాంతీయ పార్టీలలో నష్టపోయాడంట…..ఛా..వూరుకో.. సుజానా..నీ కామెడీ తగలెయ్య…కులం పేరుతో చంద్రబాబుకు దగ్గరై వేల కోట్లు సంపాదించింది, రాజధానిలో బినామీల పేరుతో 600 ఎకరాలకు పైగా పేద రైతుల భూములను నొక్కేసింది..టీడీపీ అనే ప్రాంతీయ పార్టీలో ఉన్నప్పుడు కాదా..ఏం చౌదరి గారు..ఇట్టా మాట్లాడితే ఎలా… టీడీపీ అనే ప్రాంతీయపార్టీతో లాభపడి..ఇలా నష్టపోయానని చెబితే ఎలా మీ ప్రియాతి ప్రియమైన బాబుగారి గుండె బద్దలైపోదు..హమ్మ..ఎంత మాటనేసారు.. ఏంటేంటి..ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు నాటి అవసరాలు వేరంటావా..అవున్లే..ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాతే కదా..మీ సామాజికవర్గం రాజకీయంగా, ఆర్థికంగా బలపడింది…మీ అవసరం కొద్ది పెట్టాడులె..(రామరామ ఈ మాట నేను అనడం లేదయ్యా..గిట్టనోళ్లు చెప్పుకుంటుంటే విన్నా…పెద్దాయన క్షమించుగాక ) ఇంకా ఏమన్నావు..1996 నుంచి రాష్ట్రంలో రాజకీయాలు చంద్రబాబు, వైఎస్ కుటుంబాల చేతుల్లోకి వెళ్లిపోయాయంటావా…వార్నీ నీ జాన్‌ జిగినీ దోస్త్..నీ గురుసమానుడు చంద్రబాబును ఎంత మాటనేసావు సుజనా… ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కుని, నారావారి కుటుంబపాలన మొదలైందని…నీ మాటలతో బాబోరి వెన్నులో గునపం దింపేసావుగా సుజనా..ఏంటీ వైయస్, నారావారి కుటుంబపాలన అంటావా…ఒకపక్క వైయస్ కొడుకు రాజకీయాల్లో వీరుడిలా పోరాడి..సీఎం కుర్చీ ఎక్కితే..తన కొడుకు   లోకేషం వారసుడిగా సెట్ అవడం లేదని…నారావారు నార పిసుక్కుంటుంటే…నువ్వు కుటుంబ పాలన అంటుంటే మీ బాబోరి మనసు చివుక్కుమనదు…ఇంకేమన్నావు…గతంలో ప్రాంతీయవాదానికి మద్దతు ఇచ్చావా…ఇప్పుడు జాతీయవాదమే స్థిరమైనది అన్న విషయం ఇప్పుడు నీకు తెలిసివచ్చిందా…అవున్లే..అప్పుడంటే కులాభిమానంతో, నీ వ్యాపార ప్రయోజనాల కోసం టీడీపీకి ఆర్థికంగా మద్దతు ఇచ్చావు..ఇప్పుడు కేసుల భయంతో జాతీయపార్టీఅయిన బీజేపీలో చేరావు..ఇంతోటి దానికి జాతీయవాదం, ప్రాంతీయవాదం అన్న డైలాగులు నీకు అస్సలు సూట్ కావు సుజనా.. కాస్త స్క్రిప్ట్ మారిస్తే..జనాలు బతికిపోతారు..లేకుంటే జబర్దస్త్ కమేడియన్లు కూడా నీ ముందు ఎందుకు పనికారారు. వామ్మో..వామ్మో….నీ కామెడీకి నవ్వాగట్లే సుజనా..మరీ జనాలు వెర్రి పుష్పాలు కాదు సుజనా..నీవు ఏది చెబితే అది నమ్మడానికి…అయినా ఏంటీ మదిలో మహాత్ముడా…గాడిద గుడ్డేం కాదు…బీజేపీలో చేరినా..నీ మదిలో మీ కులప్రభువు చంద్రబాబే తిరుగుతున్నాడులే..ఈ విషయం ఏపీలో నిక్కరేసుకున్న ఏ బుడ్డోడిని అడిగినా చెబుతాడు…పువ్వు పార్టీలో చేరినా..బాబోరికి భజన చేస్తూ, కమలనాథుల చెవిలో పువ్వులు పెడుతున్న నీ తెలివితేటలకు హ్యాట్సాఫ్ సుజనా…ఏంటేంటి..గాంధీ సంకల్పయాత్ర చేపట్టావా..మా నాయనే..పాపం మీ బాబోరిని మళ్లీ మోదీకి దగ్గరచేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నావు…నువ్విలా వేల కోట్లు ఎగ్గొట్టేసి గాంధీ పేరుతో సంకల్పయాత్ర చేస్తే..రూపాయి నోటు మీద ఉన్న మహాత్ముడి ఆత్మ ఘోషిస్తది సారూ..ఎంచెక్కా బాబోరి సంకల్పయాత్ర అని ఓపెన్‌గా చెప్పుకుంటే నీ సొమ్మేం పోయింది..ఇగో..ఇంకోపాలి గాంధీ పేరు చెప్పావనుకో..జనాలు నవ్వుకుంటరు…ఇంకోమాట.. పువ్వు పార్టీలో చేరి ఇంకా బాబోరికే వలపు బాణాలు విసురుతుంటే..అక్కడ మీ మోదీకి ఎక్కడో మండుద్ది జాగ్రత్త…మోదీని తక్కువ అంచనా వేయమాక…మీ నక్కజిత్తుల బాబుగారి కంటే మహాముదురు..నిన్ను వాళ్ల పార్టీలో చేర్పించి మళ్లీ తనతో కాపురం చేయడానికి మీ బాబోరు చేస్తున్న యవ్వారం అంతా మోదీకి తెలియదు అనుకున్నావా..అన్నీ తెలుసు…టైమ్ వచ్చినప్పుడు నిన్ను, మీ బాబోరిని కరకట్ట నుంచి కృష్ణానదిలో ముంచేస్తాడు..జాగ్రత్త…చివరాఖరికి నేను చెప్పొచ్చేది ఏంటంటే..ఈ మదిలో మహాత్ముడు, గాంధీ సంకల్పయాత్రలు అన్న డైలాగులు నీకు అస్సలు సూట్ కావు సుజనా..బాబ్బాబు..నీకు దండంపెడతా..మదిలో బాబోరు, చంద్రన్న సంకల్పయాత్ర అని ఓపెన్‌గా చెప్పేసేయ్..ఓ పనైపోద్ది..అంతే కానీ..ఇలా కామెడీ డైలాగులు కొడితే..రాజకీయాల్లో జబర్దస్త్ కమేడియన్ అవుతావు..ఎందుకు చెబుతున్నావో అర్థం చేసుకో..అంతా నీ మంచికే సుజనా..నేను ఇలా అన్నానని ఫీల్ అవడం లేదుగా.. ఫీల్ అయితే సారీ..ఓకేనా..బై

– ఎస్‌.పి. కస్తూరి.