తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న శ్రీమతి రేఖా నాయక్ దంపతుల తనయ వివాహమహోత్సవానికి ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్‌తో పాటు ఎంపీలు కేశవరావు, సంతోష్ కుమార్, మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమానికి హజరయ్యారు. ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్ కుమార్తె పూజ-శరత్ చంద్రల వివాహం నగరంలోని సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో చాలా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన వధూవరులను ఆశీర్వదించి..వివాహా శుభాకాంక్షలు తెలిపారు.
