Home / TELANGANA / ఈ నెల 27న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక..!!

ఈ నెల 27న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక..!!

మున్సిపల్‌ మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ నెల 27న కొత్త పాలకమండళ్ల సమావేశం నిర్వహించి.. ఆ సమావేశంలోనే ఎన్నిక పక్రియ నిర్వహించ నున్నట్టు ఈసీ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 25న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. దీంతో మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో గెలిచిన సభ్యులు జనవరి 27వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం కొత్త పాలకమండలి తొలి సమావేశం నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో పేర్కొంది.