తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా లోని ఇండస్ట్రీస్ టిన్నర్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ లోని ఫ్యాక్టరీలో రియాక్టర్ కు ఛార్జింగ్ పెడుతుండగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి.దీంతో టిన్నర్ ఫ్యాక్టరీ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి.ఈ అగ్నిప్రమాద సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి
పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
