Home / TELANGANA / పట్టుచీరెలపై కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్రాలు

పట్టుచీరెలపై కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్రాలు

దాదాపు పద్నాలుగేళ్ళ పాటు కోట్లాడి తెలంగాణ రాష్ట్ర కలను నెరవేర్చి.. గత ఆరు ఏళ్ళుగా బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా పలు సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తూ.. అన్ని వర్గాల ప్రజల మన్నలను అందుకుంటున్న ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ,మంత్రి కేటీ రామారావుపై రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ కాలనీలో నివాసముంటున్న నేత కార్మికులు నర్సింహాస్వామి,హరిప్రసాద్ లు తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు.

నేతకార్మికుడైన నర్సింహస్వామి రాష్ట్రంలోనే తొలిసారిగా తన కార్ఖానాలో ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌ మరమగ్గాన్ని ఏర్పాటుచేసి పట్టుచీరెలను తయారు చేసే సంగతిని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వాటిని సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో ప్రవేశపెట్టాలని అనుకున్నారు. అంతే కాకుండా ఈ యంత్రాలను తీసుకోవాలనుకున్న వారికి పీఎంఈజీపీ ద్వారా 25 శాతం సబ్సిడీపై రుణసౌకర్యం కూడా కల్పించారు. దీంతో ఎంతో మంది నేతన్నలు ఈ యంత్రాన్ని కొనుగోలు చేసారు. దీంతో వారి కులవృత్తుల గురించ ఆలోచించి, అందరికీ ఉపాధి కల్పిస్తున్నా మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాలను చీరలపై వేయాలను కున్నాడు హరిప్రసాద్. అనుకున్నట్టుగానే వారం రోజుల పాటు కష్టపడి కేసీఆర్, కేటీఆర్ చిత్రాలు ఉన్న పట్టు చీరలను ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌ ప్రతినిధి వెంకట్రావు సౌజన్యంతో డిజైన్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అండగా మంత్రి కేటీఆర్ నిలుస్తున్నారని ఆయన ధన్యవాదాలు తెలిపారు.త్వరలోనే ఇవి వారికిస్తామని ఆయన పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat