తెలంగాణలో మరో కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ కు చెందిన 24 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఈమె ఇటీవలే ఇటలీ నుంచి హైదరాబాద్ కు వచ్చింది. వచ్చిన తరువాత జ్వరంతో బాగా ఇబ్బంది పడడంతో గాంధీ ఆశుపత్రిలో చేరగా ఆమెకు పరీక్షలు నిర్వహించారు. అందులో ఆమెకు కరోనా ఉన్నట్టు తెలిసింది. దాంతో వెంటనే అప్రమత్తమయిన అధికారులు వారి కుటుంబంలో అందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. అంతకకుండా జ్వరం రాకముందు ఎవరెవరిని కలిసారు, ఎక్కడ ఉన్నారు అని వివరాలు సేకరించారు. గత కొన్ని రోజులుగా ఆ యువతి ఎవరిని కలిసిందో అన్ని వివరాలు తెలుసుకున్నారు. దాదాపు 30మందిని కలిసిందని ఇప్పటివరకు సమాచారం ఉండడంతో వెంటనే వారికి సమాచారం అందించి..దగ్గు, జ్వరం వంటివి వస్తే వెంటనే హాస్పిటల్ కు వెళ్ళాలని సూచించారు.
