రామగుండం నియోజవర్గంలో సంగీత కళాశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర టూరిజం, కల్చరల్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లో మంత్రిని కలిసిన ఎమ్మెల్యే వినతిపత్రం అందించారు.
రామగుండం నియోజవర్గంలో ప్రతిభ కలిగిన కలిగిన సంగీత కళాకారులున్నారని, ఈ ప్రాంతంలో సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువ ఉందని తెలిపారు.
జిల్లాలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంగీత కళాశాలకు అనువుగా ఉంటుందని, సంగీత కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే వెంట రామగుండం నగర డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు ఉన్నారు.