Home / SPORTS / ఏడో విడత హరితహారానికి సిద్ధం

ఏడో విడత హరితహారానికి సిద్ధం

ఏడవ విడత హరిత హారం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవు తోంది. ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఖరారు చేయనున్నారు. వర్షాల జోరు మరింత పుంజుకోగానే జూలై మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని అట్టహా సంగా ప్రారంభించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాటు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్దఎత్తున నాటేందుకు అవసరమైన మొక్కలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆరు విడుతల్లో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చేప ట్టింది. ఇప్పటి వరకు 230 కోట్ల మేర మొక్కలను నాటా లని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 217 కోట్ల మొక్కలను నాటారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ( 2014 నుంచి 2020) రూ. 5230 కోట్లను ఖర్చు చేసింది.

భూభాగంలో 33శాతం పచ్చదనం ఉండాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్న లక్ష్యంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని 2015 జూలై 3న చిలుకూరి బాలాజీ ఆలయ ప్రాంగణంలో సిఎం కెసి ఆర్ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సమృద్ధిగా వానలు కురి సేందుకు, అడవులను రక్షించి, చెట్లను పెంచి పచ్చద నాన్ని కాపాడటమే లక్ష్యంగా.. ”వానలు వాపస్ రావాలె” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో అటవీ భూమి 67 లక్షల ఎకరాలు (24 శాతం) ఉండగా, వార్షిక వర్షపాతం 845 మి.మీటర్లగా నమోదైంది. అటవీ భూమి అంత ఉన్నప్పటికీ అందులో చెట్లు మాత్రం లేవు. సామాజిక అడవులు పెంచడంతో పాటు, అటవీ ప్రాంతంలో అడవిని పునరుద్దరించేందుకు హరితహారం కార్యక్రమంలో చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర భూభాగం 1,12,101 కిలోమీటర్లు ఉండగా అడవులు 26,903.70 కిలోమీటర్ల మేర (24శాతం) ఉన్నాయి. హరితహారం ద్వారా అటవీ ప్రాంతాన్ని 33శాతానికి పెరి గేలా ప్రతి సంవత్సరం పెద్దఎత్తున హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఆరు విడతల్లో నాటిన మొక్కల వివరాలు
————————————
ఏటా కోట్లల్లో మొక్కలు నాటుతుండటంతో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. హరితహారానికి ముందు రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 24 శాతం ఉండేది. ఈ కార్యక్రమం చేపట్టిన ఐదేండ్ల వ్యవధిలోనే ఏకంగా అటవీ విస్తీర్ణం 4శాతం పెరిగి 28శాతానికి చేరుకున్నది. ఈ విష యాన్ని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియానే స్వయంగా ప్రక టించింది. మరో 5% పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించు కున్న 33శాతం అడవుల విస్తీర్ణం లక్ష్యం నెరవేరనున్నది.

మొక్కల పెంపకంలో తెలంగాణ నంబర్ వన్
————————————-
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం మంచి ఫలి తాలనిచ్చింది. దేశంలోనే మొక్కల పెంపకంలో తెలం గాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో ఇటీ వల పార్లమెంట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే . 2014– 15 నుంచి 2018-19 మధ్య చేపట్టిన హరిత హారం కార్యక్రమంతో ఐదేళ్ళ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 15.21 లక్షల హెక్టార్లలో మొక్కలు నాటారు. దేశ వ్యాప్తంగా చేపట్టిన 81.33 లక్షల హెక్టార్ల అటవీకరణలో తెలంగాణ చేపట్టిన అటవీకరణ 18.70 శాతం(15.21 లక్షల హెక్టార్లు) అంటే దాదాపు 1/5 వంతుగా ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat