Home / NATIONAL / BJP కి చుక్కలు చూయిస్తున్న TRS Social Media

BJP కి చుక్కలు చూయిస్తున్న TRS Social Media

తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్‌ వచ్చిన సందర్భంలో నిన్న శనివారం సాయంత్రానికి ట్విటర్‌ ట్రెండింగ్‌లో ‘మోదీ మస్ట్‌ అన్సర్‌’ హ్యాష్‌ట్యాగ్‌ నంబర్‌ వన్‌గా నిలిచింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా రాక సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ మోదీకి పలు ప్రశ్నలు సంధించారు.

వీటికి సమాధానాలు చెప్పాలంటూ ‘మోదీ మస్ట్‌ ఆన్సర్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో పెద్దఎత్తున పోస్టులు చేశారు. గంట సమయంలోనే 60వేలకు పైగా పోస్టులు రావడంతో ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో ఇది నంబర్‌ వన్‌గా నిలిచింది. గతంలో మోదీ, దివంగత సుష్మాస్వరాజ్‌ చేసిన వ్యాఖ్యల వీడియోలు, పలు ప్రశ్నలతో కూడిన పోస్టర్లు, సీఎం కేసీఆర్‌ మాట్లాడిన వీడియోలను పలువురు పోస్టు చేశారు. 

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar