తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు లో అరెస్టైన నందకుమార్ ను కస్టడీకి ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. బంజారాహిల్స్‌లో నమోదైన కేసులో కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.
ఐదు రోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ బంజారాహిల్స్ పోలీసులు ధర్మాసానానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కస్టడీకి ఇవ్వొద్దంటూ నందకుమార్ తరపున లాయర్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లపై విచారించిన కోర్టు.. నందకుమార్‌పై నమోదైన కేసుల వివరాలు తెలపాలంటూ పోలీసులకు న్యాయస్థానం ఆదేశించింది. సోమవారం కేసుల వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించనున్నారు. దీంతో తదుపరి కేసు విచారణ వచ్చే సోమవారానికి కోర్టు వాయిదా వేసింది.