కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై ఎమ్మెల్యే గారు వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
