Breaking News
Home / SLIDER / మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని హమీద్ బస్తీ – రాళ్ళకంచ వద్ద మజిద్ ఈ మెహ్రాజ్ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో   ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మజీద్ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే   శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే   మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకు సరైన గుర్తింపు లభించిందన్నారు. ముస్లీం పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం కాకుండా షాది ముబారక్ పథకం ప్రవేశపెట్టి ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుందని గుర్తు చేశారు.

పండగలు ఘనంగా జరుపుకునేందుకు ప్రభుత్వం కానుకలు అందజేస్తుందని చెప్పారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మైనార్టీ సోదరులకు ఎటువంటి సహాయ సహకారాలకైనా సిద్ధంగా ఉంటానని అన్నారు. శివాలయ నగర్ వద్ద ముస్లీం గ్రేవియార్డు అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించి మోడల్ గ్రేవియార్డుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు.

అనంతరం కమిటీ సభ్యులతో కలిసి శివాలయ నగర్ ముస్లీం గ్రేవియార్డ్ వద్ద చేపట్టవలసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్లు మహ్మద్ సలీముద్ధిన్, చాంద్ పాషా, మహ్మద్ వలీ, మెహ్రాజ్ మజిద్ ప్రెసిడెంట్ మహ్మద్ ఆరిఫ్, వైస్ ప్రెసిడెంట్ మన్నన్, ఖాజా, డాక్టర్ హుస్సేన్, జావిద్, జనరల్ సెక్రెటరీ మహ్మద్ యూసుఫ్, జాయింట్ సెక్రటరీ మొయినుద్దీన్, క్యాషియర్లు అక్బర్ ఖాన్, మహ్మద్ వాజిద్, మహ్మద్ యాకూబ్ మరియు కమిటీ సభ్యులు, నాయకులు ప్రభాకర్ పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

Advertisement

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar