Breaking News
Home / SLIDER / తెలంగాణ రాతను మార్చిన విధాత ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ రాతను మార్చిన విధాత ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజల రాత మార్చిన విధాత ముఖ్యమంత్రి  కేసీఆర్‌ అని రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈరోజు  దీక్షా దివస్‌ను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటాలన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారని, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతూ అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతూ దేశానికే రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దుతున్నారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

నేడు తెలంగాణ ఆచరిస్తుంది.. రేపు దేశం అనుసరిస్తుందన్న రీతిలో సీఎం కేసీఆర్‌ పాలన కొనసాగుతుందని, ప్రతి పౌరుడు తలెత్తుకొని గర్వించేలా రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతున్న మహనీయుడు సీఎం కేసీఆర్‌ అన్నారు.అలాంటి గొప్ప నేత మనకు దక్కడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. తెలంగాణ ప్రగతిని చూసి తట్టుకోలేక బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర సంపదను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తోందని, తెలంగాణ ప్రజలంతా ఏకోన్ముఖమై ఈ కుట్రలను ఛేదించాలన్నారు.

సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరిచి తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటేందుకు ప్రజలు దీక్ష తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, అభివృద్ధి, భవిష్యత్ కోసం కేసీఆర్‌ దీక్ష చేపట్టి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిద్దారన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకత్వానికి అండగా నిలబడేందుకు తెలంగాణ ప్రజలు దీక్ష తీసుకోవాలని కోరారు.

MOST RECENT

Facebook Page

Advertisement

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar