Political హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ పనులకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.. డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్.. మెట్రో విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు..
డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్.. మెట్రో విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్న సందర్భంగా ఆ కార్యక్రమం తాలూకు సన్నాహక సమావేశాన్ని మంత్రి కేటీఆర్ నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీజీపీ, మెట్రో రైల్, పురపాలక శాఖ, ఎయిర్‌పోర్ట్ అధికారులు హాజరయ్యారు..
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్ ఉపయోగపడుతుందన్నారు. శంషాబాద్ నుంచి మొదలుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ప్రయాణం చేసే లక్షలాదిమందికి ఈ మెట్రో రైల్ విస్తరణ ద్వారా లబ్ధి చేకూరుతుందని, ఇంతటి కీలకమైన కార్యక్రమ శంకుస్థాపనను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. డిసెంబర్ 9వ తేదీన శంకుస్థాపన వేసే ప్రాంతంతో పాటు, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సమావేశ ప్రాంగణం ఏర్పాట్లను ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని కచ్చితంగా కట్టుదిట్టంగా ఉండాలని చెప్పుకొచ్చారు ఎట్టి పరిస్థితుల్లోనూ జాగ్రత్త చూపించవద్దని ట్రాఫిక్ విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు..