Home / ANDHRAPRADESH / Political : “మాకు ఏ పార్టీతో పొత్తులు లేవు కేవలం ప్రజలతో మాత్రమే పొత్తు ఉంది..” ముఖ్యమంత్రి జగన్

Political : “మాకు ఏ పార్టీతో పొత్తులు లేవు కేవలం ప్రజలతో మాత్రమే పొత్తు ఉంది..” ముఖ్యమంత్రి జగన్

Political వైఎస్ఆర్సిపి వేరే పార్టీలతో పొత్తు పెట్టుకోని ఉందని విమర్శలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. తాము ఇంకా ఏ పార్టీతో పోతులు పెట్టుకోవాలి అనుకోవడం లేదని కేవలం ప్రజలు మాత్రమే నమ్ముకుని ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు..

తమ పార్టీపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. వైఎస్ఆర్సిపి పార్టీ ఏ పార్టీతో బత్తులు పెట్టుకోదని స్పష్టం చేశారు.. కేవలం తాము ప్రజలు మాత్రమే నమ్మకం ముందుకు వెళ్దాం అంటూ చెప్పుకొచ్చారు..మదనపల్లెలో బటన్ నొక్కి.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 694 కోట్ల రూపాయాలు జమచేశారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ “తమకు కేవలం జనంతోనే పొత్తు ఉంటుందని తేల్చి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబులా తాను దుష్టచతుష్టయాన్ని నమ్ముకోలేదని.. ప్రజల్నే నమ్ముకున్నానని స్పష్టత ఇచ్చారు. తాను ఏం చెబుతానో, అదే చేసి చూపిస్తానన్నారు. ప్రస్తుతం రాక్షసులతో, మారీచులతో యుద్ధం చేస్తున్నామన్నా.. ” అంటూ విమర్శించారు సీఎం జగన్. అలాగే విపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడిన జగన్.. అక్షరాలు రాయడం, చదవడం మాత్రమే విద్యకు పరమార్ధం కాదని అన్నారు.. తనకు తానుగా ప్రతి పాప, ప్రతిబాబు ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇవ్వగలుగడమే విద్యకు పరమార్థమని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బల్ట్‌ ఐనిస్టిన్‌ చక్కగా చెప్పారన్నారు. అందరూ మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థాయిని అందుకోవాలని అనుకుంటున్నాట్టు చెప్పారు.. అందుకోసం తనకు వీలైనంతవరకు శత విధాల ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు..

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat