కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన 20 మంది సీఎం రిలీఫ్ ఫండ్ పథకం లబ్ధిదారులకు రూ.27,36,000/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి ఈరోజు చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్ధేశ్యంతో గౌరవ సీఎం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా సహాయం అందిస్తున్నారని తెలిపారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గడిచిన ఏళ్లుగా వేలాది మందికి లక్షల రూపాయలు మంజూరు చేయిస్తూ అందిస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.